ప్రైవేట్ అక్రమ ఫీజు దోపిడీపై రణం..!

by Kodari Anjali |

నర్సంపేట నియోజక వర్గ వ్యాప్తంగా గల ప్రైవేట్ పాఠశాలలో అనియంత్రిత ఫీజుల తగ్గింపు లక్ష్యంగా పేరెంట్స్ అసోసియేషన్ అధ్వర్యంలో భారీ ధర్నాను అమరవీరుల స్థూపం దగ్గర చేపట్టారు.

ప్రైవేట్ అక్రమ ఫీజు దోపిడీపై రణం..!
X

దిశ, నర్సంపేట: నర్సంపేట నియోజక వర్గ వ్యాప్తంగా గల ప్రైవేట్ పాఠశాలలో అనియంత్రిత ఫీజుల తగ్గింపు లక్ష్యంగా పేరెంట్స్ అసోసియేషన్ అధ్వర్యంలో భారీ ధర్నాను అమరవీరుల స్థూపం దగ్గర చేపట్టారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రైవేట్ స్కూళ్లు వసూలు చేస్తున్న అధిక ఫీజులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతీ ప్రైవేట్ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇష్టారీతిన ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు పెంచుతున్న ఫీజులను సవరించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఫైర్ సేఫ్టీ, ఆర్టీఏ నిబంధనలు పాటించాలన్నారు. పుస్తకాల పేరుతో జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. పాఠశాల పరిసరాలు, బస్సుల్లో విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు హాజరై విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. పేరెంట్స్ అసోసియేషన్ చేస్తున్న న్యాయమైన డిమాండ్స్ ను నెరవేర్చాల్సి ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలను కోరారు.

ఉన్నతాధికారుల హామీ...

ధర్నా సంగతి తెలుసుకున్న ఏసీపీ, ఆర్డీవో పేరెంట్స్ అసోసియేషన్ బాధ్యులను కార్యాలయానికి పిలిపించారు. అనంతరం పేరెంట్స్ అసోసియేషన్ బాధ్యులు ధర్నా చేపట్టడానికి గల కారణాలను అధికారులకు వివరించారు. సానుకూలంగా స్పందించిన ఏసీపీ రవీందర్ రెడ్డి ఆర్డీవోతో మాట్లాడారు. స్కూళ్ళ యాజమాన్యాలతో మాట్లాడి చర్చలకు తేదీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ధర్నాకు సంఘీభావం తెలియచేసిన నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్స్ బీరం భరతరెడ్డి, హన్మకొండ శ్రీధర్ కి, విద్యార్థి సంఘాలకు, ప్రజా సంఘాలకు, యూత్ క్లబ్ లకు పేరెంట్స్ అసోసియేషన్ బాధ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Next Story