కుప్పం పర్యటన నాకెంతో ఆనందాన్నిచ్చింది : సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |

రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గం దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

కుప్పం పర్యటన నాకెంతో ఆనందాన్నిచ్చింది : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గం దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించిన ఆయన.. పలు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన ఎంతో ఉత్సాహంగా సాగిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ప్రశాంతమైన కుప్పం పర్యటన తనకు కొత్త శక్తిని ఇచ్చిందని వెల్లడించారు. కంగుంది భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే 30 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. బంగారు కుప్పం సాకారం కోసం సమగ్ర విజన్ ను సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు.

Next Story