జూలై 10న విద్యా సంస్థల బంద్

by velandi.Saikiran |

రాష్ట్ర వ్యాప్తంగా జూలై 10న విద్యా సంస్థల బంద్ కు వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి.

జూలై 10న విద్యా సంస్థల బంద్
X

దిశ,నెక్కొండ: విద్యారంగ సమస్యల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్తంగా జూలై 10న విద్యా సంస్థల బంద్ కు వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి.వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని అంబేద్కర్ సెంటర్లో ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యు, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ పోస్టర్ ను ఆవిష్కరించారు.రాష్ట్రంలో ఉన్న 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించాలనే ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలి.ప్రైవేట్,కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని అరికట్టి, ఫీజుల నియంత్రణ చట్టాన్ని చేయాలి.విద్యాశాఖ కు ప్రత్యేకంగా మంత్రిని తక్షణమే నియమించాలి.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి,ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 5 లక్షల మంది విద్యార్థులకు భరోసా కార్డులు,ఉచిత లాప్ టాప్ లు తక్షణమే అందించాలన్నారు.రాష్ట్రవ్యాప్తంగా జరుగబోయే బందుకు మేధావులు,సామాజిక కార్యకర్తలు,పేరెంట్స్ అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యు,ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు దిడ్డీ.పార్థసారథి, గుర్రం.అజయ్,వినోద్ కుమార్,పైసా.గణేష్,నాయకులు,శ్రీకాంత్, సిద్దు,వంశీ తదితరులు పాల్గొన్నారు.

Next Story