- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భగీరథ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
మిషన్ భగీరథ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌కు వినతిపత్రం సమర్పించారు.

దిశ, రెబ్బెన : మిషన్ భగీరథ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ, వేతనాలు అందక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయడంతో పాటు ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మికుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి, జిల్లా అధ్యక్షుడు చాపిడి బాలేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కే. జంషద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కే. షకీర్ తదితరులు పాల్గొన్నారు.






