ఆస్పత్రిలో... జైలు నుండి తప్పించుకున్న పోక్సో కేసు నిందితుడు

by velandi.Saikiran |   (  Updated:2026-07-06 12:45:26  IST  )

పోక్సో కేసులో జైలు నుంచి సోమవారం తప్పించుకొని పారిపోయిన నిందితుడు కిషోర్ కుమార్ రెడ్డి ఆచూకీ లభించడంతో జైలు సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

ఆస్పత్రిలో... జైలు నుండి తప్పించుకున్న పోక్సో కేసు నిందితుడు
X

దిశ, అమరచింత/వనపర్తి క్రైమ్: పోక్సో కేసులో జైలు నుంచి సోమవారం తప్పించుకొని పారిపోయిన నిందితుడు కిషోర్ కుమార్ రెడ్డి ఆచూకీ లభించడంతో జైలు సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. అమరచింత మండలంకు చెందిన మైనర్ బాలికను కిషోర్ కుమార్ రెడ్డి ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత నెల 15వ తేదీన కిషోర్ కుమార్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు పోలీసులు. మహబూబ్ నగర్ జైలులో ఉన్న కిషోర్ కుమార్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున తప్పించుకొని పారిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. జైలు నుండి తప్పించుకొని, తన‌ వ్యవసాయ పొలానికి చేరుకున్నాడు. ఈ విష‌యాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా, అప్పటికే నానో యూరియా ద్రావణాన్ని సేవించి ఆత్మహత్యకు కిషోర్ కుమార్ రెడ్డి పాల్పడినట్లు గుర్తించారు. వెంటనే జైలు అధికారులకు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చి.. వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా తప్పించుకున్న నిందితుడు తిరిగి దొరకడంతో జైలు అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story