పిల్లలకు రుచికరమైన భోజనం అందుతున్నదా..?

by Taduka Kalyani |

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందేలా చూడాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు.

పిల్లలకు రుచికరమైన భోజనం అందుతున్నదా..?
X

దిశ, సత్తుపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందేలా చూడాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. సోమవారం సత్తుపల్లి పట్టణంలోని ఉర్దూ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆమె విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారి పేర్లు, చదువు, పాఠ్యపుస్తకాలు సకాలంలో అందాయా, పాఠశాలలో రుచికరమైన భోజనం అందుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు. చిన్నప్పటి నుంచే ధైర్యంగా మాట్లాడే అలవాటు పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను విద్యార్థులకే అప్పగించారు. తర్వాత సత్తుపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డుకు ఇరువైపులా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్, ఆసుపత్రి వైద్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ దయానంద్ విజయ్ కుమార్, ఎంఈఓ నక్క రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ కె. నరసింహ, ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ నారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, మున్సిపల్ చైర్‌పర్సన్ రెహనా బేగం, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, వార్డు కౌన్సిలర్లు, దూదిపాల రాంబాబు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, జగన్నాథం శీను, మండల అధ్యక్షుడు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story