- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊహకే అందని ‘రోమాంచకం’.. సందీప్ రెడ్డి వంగా సినిమా గ్లింప్స్ రిలీజ్
భద్రకాళీ పిక్చర్స్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న యూనిక్ లవ్ స్టోరీ ‘రోమాంచకం’.

దిశ, సినిమా: భద్రకాళీ పిక్చర్స్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న యూనిక్ లవ్ స్టోరీ ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేసి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ డీవోపీ పవన్ పప్పుల అందించిన పెయింటింగ్ లాంటి బ్యూటిఫుల్ విజువల్స్‌తో, వాసుకి వైభవ్ కంపోజ్ చేసిన స్వీట్ మెలొడియస్ ట్యూన్‌తో సాగుతూ హీరో,హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమను, వారి మధ్య ఏర్పడిన దూరాన్ని చూపిస్తూ సాగింది. 'అణువు అణువును ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే.. రోమాంచకం, ఊహకే అందని ఉవ్వెత్తునెగిసే ఉత్తుంగ తరంగమే.. రోమాంచకం..' అంటూ గ్లింప్స్‌లో వచ్చిన లిరిక్స్ ఈ మూవీ ఎంత వైబ్రేటింగ్‌గా ఉండబోతుందో తెలియజేస్తోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక జంట కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుండగా.. త్వరలోనే రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్స్ పంచుకోనున్నారు మేకర్స్.






