ఎమ్మెల్యే చొరవతో రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

by Batti.Sumithra |

రెబ్బెన మండలంలోని సింగిల్‌గూడ గ్రామానికి చెందిన కొట్రంగి పద్మ గత కొంతకాలంగా బ్రెయిన్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు.

ఎమ్మెల్యే చొరవతో రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
X

దిశ, రెబ్బెన : రెబ్బెన మండలంలోని సింగిల్‌గూడ గ్రామానికి చెందిన కొట్రంగి పద్మ గత కొంతకాలంగా బ్రెయిన్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని కలిసి తమ సమస్యను వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బాధితురాలిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. అలాగే చికిత్స ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి ఎల్‌ఓసీ (LOC) ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సహాయం మంజూరు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కొట్రంగి పద్మ కుటుంబ సభ్యులు, సింగిల్‌గూడ గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కోవా లక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమె చొరవను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ దుర్గం భరద్వాజ్, మాజీ ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, నవీన్ కుమార్ జైస్వాల్, అన్నపూర్ణ మురళీ గౌడ్, షేక్ మన్సూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story