- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ఉల్లంఘన..నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష
మందుల విక్రయ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో ఒక వ్యక్తికి మూడేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ. 10వేల జరిమానా విధిస్తూ దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి బి. భవాని తీర్పునిచ్చారు.

దిశ, దమ్మపేట : మందుల విక్రయ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో ఒక వ్యక్తికి మూడేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ. 10వేల జరిమానా విధిస్తూ దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి బి. భవాని తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. అశ్వారావుపేటకు చెందిన మార్తా పెద్దిరాజు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940 నిబంధనలను ఉల్లంఘించినట్లుగా గుర్తించిన భద్రాద్రి కొత్తగూడెం డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, ఫిర్యాదు చేశారు. దీనిపై 2024లో కేసు నమోదు చేసి దమ్మపేట కోర్టులో హాజరుపరిచారు.ఈ కేసు విచారణలో ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హెచ్. శ్రీధర్ వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 లోని పలు సెక్షన్ల కింద నిందితుడు పెద్దిరాజుకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష మరియు పదివేల రూపాయల జరిమానా విధించింది.






