- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు రంగారెడ్డి జిల్లాలో హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన
రూ.338 కోట్ల వ్యయంతో హ్యామ్ విధానంలో చేపట్టనున్న ఆధునిక నాలుగు లేన్ల రహదారుల నిర్మాణ పనులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.

- రూ.338 కోట్లతో పనులు.. పాల్గొననున్న మంత్రి కోమటి రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : రూ.338 కోట్ల వ్యయంతో హ్యామ్ విధానంలో చేపట్టనున్న ఆధునిక నాలుగు లేన్ల రహదారుల నిర్మాణ పనులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక రహదారి ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన, నాణ్యమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపు లభించనుంది. ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో నాలుగు లేన్ల రహదారుల నిర్మాణంతో రహదారుల రూపురేఖలు మారిపోనున్నాయి.
శంకుస్థాపన చేయనున్న రహదారి పనులు..
* హయత్‌నగర్ – తొర్రూరు – కోహెడ – అనాజ్‌పూర్ వరకు
* అనాజ్‌పూర్ – అబ్దుల్లాపూర్‌మెట్ – బండరావిర్యాల వరకు
* హయత్‌నగర్ – కుంట్లూరు – పసుమాముల – తారామతిపేట వరకు
* సాగర్ రోడ్డు – ఇంజాపూర్ – తొర్రూరు – బ్రాహ్మణపల్లి – రాగన్నగూడ వరకు
* సాగర్ రోడ్డు – ఇంజాపూర్ – హయత్‌నగర్ వరకు






