- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆడియన్స్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.. నభా నటేష్ షాకింగ్ కామెంట్స్
యంగ్ హీరోయిన్ నభా నటేష్ తాజాగా ‘నాగబంధం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ నభా నటేష్ తాజాగా ‘నాగబంధం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ పౌరాణిక యాక్షన్ అడ్వెంచర్‌లో జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, ఐశ్వర్య మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జులై 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా తాజాగా ఏర్పాటు చేసిన థాంక్యూ మీట్‌లో నభా నటేష్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘ఇందులో నేను చేసిన పార్వతి పాత్రకు వస్తున్న స్పందన పట్ల నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. అయితే.. రివ్యూవర్స్ అంటే మాకు చాలా గౌరవం. కానీ చాలా మంది తప్పుడు రివ్యూస్ ఇస్తున్నారు. అసలు సినిమా కూడా చూడకుండా ట్వీట్స్ వేస్తున్నారు. కానీ, సినిమా చూస్తున్నప్పుడు ఓ వ్యక్తి నాతో ‘నేను ఈ సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. అందుకే మా అమ్మకు, నాన్నమ్మకు కూడా చూపించాలని వాళ్లను తీసుకుని రెండోసారి వచ్చాను అని చెప్పారు. చాలా మంది మా సినిమాను ఆదరిస్తున్నారు. నిజంగా కంటెంట్ బాగుంటే సినిమాను సక్సెస్ చేస్తారని ఆడియన్స్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది.






