- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్ : శేరిపల్లి బందారం ఎంజేపీ బాలికల పాఠశాల యథాతథం
ఇటీవల దిశలో ప్రచురితమైన శేరిపల్లి బందారం (మొండిచింత)లోని ఎంజేపీ బాలికల పాఠశాల తరలింపు అంశంపై వచ్చిన కథనానికి స్పందన లభించింది.

దిశ, దౌల్తాబాద్: ఇటీవల దిశలో ప్రచురితమైన శేరిపల్లి బందారం (మొండిచింత)లోని ఎంజేపీ బాలికల పాఠశాల తరలింపు అంశంపై వచ్చిన కథనానికి స్పందన లభించింది. పాఠశాలను తరలించవద్దని తల్లిదండ్రులు, గ్రామస్థులు చేసిన విజ్ఞప్తి మేరకు జిల్లా ఇంఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, తిర్మలాపూర్ సర్పంచ్ బండారి లాలూ తెలిపారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, ప్రస్తుతం శేరిపల్లి బండారం ఎంజేపీ బాలికల పాఠశాలను తరలించే ప్రక్రియ ఏదీ లేదని స్పష్టం చేసినట్లు వారు వెల్లడించారు. మంత్రి హామీతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఊరట వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్‌కు మద్దెల స్వామి, బండారి లాలూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాములు, జిల్లా కార్యదర్శి గణేష్ తదితరులు పాల్గొన్నారు.






