- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్జున్ రెడ్డి, యానిమల్‌లా వివాదాస్పద కంటెంట్ ఉండదు.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై నిర్మాత షాకింగ్ కామెంట్స్ వైరల్
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’.

దిశ, సినిమా: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్న ఈ మూవీకి సాయి రాజేష్ కథ అందిచగా రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 24న ఈ సినిమా రిలీజ్ కాబోతుండగా.. తాజా ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్.
‘మన తెలుగు జంట చెన్నైలో నివసిస్తుంటారు. అందుకే చెన్నై లవ్ స్టోరీ అని సినిమా టైటిల్ పెట్టాం. మేము అనుకున్న కథకు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ వందశాతం న్యాయం చేశారు. ఈ సినిమాలోని ఎమోషన్స్ చాలా రోజులు మనకు గుర్తుంటాయి. ఊర్లలో కూడా మా సినిమా రిలీజ్ కోసం ఆడియెన్స్ వేచి చూస్తున్నారు. ఆ ఇంపాక్ట్ మేము క్రియేట్ చేయగలిగాం. ఒక మంచి రిలీజ్‌ను మా సినిమాకు ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది. అర్జున్ రెడ్డి, యానిమల్, బేబి.. ఇలాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ ఎప్పుడు వచ్చినా కొన్ని వివాదాలు వస్తుంటాయి. ‘చెన్నై లవ్ స్టోరీ’లో అలాంటి వివాదాస్పద కంటెంట్ ఉండదు. ఇది ఎక్కువగా ఎమోషనల్ డెప్త్ మీద వెళ్లే కథ. మా సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతుంది. అందరి ప్రసంశలు అందుకుని మేకర్స్‌గా మాకు ఒక మార్క్ క్రియేట్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. అలాగే మా సినిమా టికెట్ రేట్స్ పెంచడం లేదు. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ ఇలా అందరూ మా సినిమాను చూసి సక్సెస్ చేయాలి’ అని తెలిపారు.






