ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం కూల్చివేత

by velandi.Saikiran |

ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని మేడిపల్లి తహసీల్దార్ వెంకట నర్సింహ రెడ్డి హెచ్చరించారు.

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం కూల్చివేత
X

దిశ, మేడిపల్లి: ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని మేడిపల్లి తహసీల్దార్ వెంకట నర్సింహ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా బోడుప్పల్ పరిధిలోని సర్వే నంబర్ 63/1లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాన్ని సోమవారం మేడిపల్లి తహసీల్దార్ వెంకట నర్సింహ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట నర్సింహ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములపై ఎలాంటి ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను సహించబోమని స్పష్టం చేశారు.

నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖ కట్టుబడి ఉందని, ఆక్రమణలను ఎప్పటికప్పుడు గుర్తించి తొలగించే చర్యలు కొనసాగుతాయని తెలిపారు. నిర్మాణ పనులు ప్రారంభించే ముందు భూమి యాజమాన్య వివరాలను సంబంధిత అధికారులతో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని ప్రజలకు సూచించారు.

Next Story