- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: ఇన్వెస్టర్లకు రూ. 8.23 లక్షల కోట్ల లాభాలు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఎల్అండ్‌టీ, సన్ ఫార్మా వంటి హెవీవెయిట్ షేర్లు మార్కెట్ ర్యాలీకి మద్దతిచ్చాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లలో వరుస లాభాలు నమోదవుతున్నాయి. ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐ) కొనుగోళ్లు పెరగడం, ప్రైవేట్ బ్యాంకుల త్రైమాసిక ఫలితాలపై సానుకూల అంచనాల కారణంగా సూచీలు వరుసగా నాలుగో రోజు లాభపడ్డాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్లతో సోమవారం సెన్సెక్స్ 521 పాయింట్లు ఎగబాకి 78,285 వద్ద ముగియగా, నిఫ్టీ 159 పాయింట్లు పెరిగి 24,430 వద్ద ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఎల్అండ్‌టీ, సన్ ఫార్మా వంటి హెవీవెయిట్ షేర్లు మార్కెట్ ర్యాలీకి మద్దతిచ్చాయి. వరుస లాభాల కారణంగా సోమవారం ఒక్క రోజులో కంపెనీల మార్కెట్ విలువ రూ. 2.13 లక్షల కోట్లు పెరిగి రూ. 482.33 లక్షల కోట్లకు చేరగా, గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో పెట్టుబడిదారుల సంపద మొత్తం రూ. 8.23 లక్షల కోట్లు పెరిగింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 95.41 వద్ద ఉంది.






