- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్య్సకారుల ఆచూకీపై పోలీసుల కీలక ప్రకటన
బంగాళాఖాతంలో విశాఖకు చెందిన మత్య్సకారులు 4వ తేదీ రాత్ర సమయంలో గల్లంతైన విషయం తెలిసిందే. అయితే 48 గంటలు గడిచిపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది...

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతం(Bay of Bengal)లో విశాఖ(Visakha)కు చెందిన మత్య్సకారులు(Fishermen) 4వ తేదీ రాత్ర సమయంలో గల్లంతైన విషయం తెలిసిందే. అయితే 48 గంటలు గడిచిపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకా వారి ఆచూకీ దొరకలేదు. దీంతో వారి కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 4 షిప్పులు, 2 హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. 4న మిస్సింగైన మత్యకారుల నుంచి అర్ధరాత్రి సమయంలో తమకు కమ్యూనికేషన్ సమాచారం వచ్చిందని చెప్పారు. నేవీ, కోస్టల్ సెక్యూరిటీకి తాము మెయిల్ చేశామని, వాళ్లతో మాట్లాడామని విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి రిస్య్కూ ఆపరేషన్ జరుగుతోందన్నారు. అదే రోజు కర్రి చిన్నా అనే మత్య్సకారుడు సురక్షితంగా రక్షించారని చెప్పారు. అయితే మిగిలిన వారి కోసం కర్రి చిన్నా కనిపించిన ప్రాంతంలోనూ, సమీపంలోనూ నేవీ, కోస్ట్ గార్డు అధికారులు సెర్చింగ్ చేశారని విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి స్పష్టం చేశారు.
ఒడ్డుకు తీసుకొస్తున్నాం..
‘‘వాతావరణం బాగాలేదు. సముద్రంలో అల్లకల్లోలంగా ఉంది. మేం తిరిగి వచ్చేస్తున్నామని మత్య్సకారులు వాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పారు. వేట ముగించుకుని వచ్చేసమయంలో గల్లంతయ్యారు. బోటు తిరగబడిన సమయంలో ఒకరు ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు కొంతదూరం ఈదుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆగిపోయారు. మరో ఇద్దరు కూడా అక్కడి నుంచి ఈదుకుంటూ వచ్చారు. వాళ్లూ ఆగిపోయారు. కర్రి చిన్నాను చైన్ షిప్ వాళ్లు రక్షించారు. మిగిలిన వాళ్లను కూడా కోస్టు గార్డు షిప్‌లో కొంతవరకు తీసుకొచ్చారు. మరో రెండు గంటల్లో గంగవరం పోర్టు, లేదా హార్బర్ వద్దకు వస్తామని సమాచారం ఇచ్చారు. పెద్ద బోటు కాబట్టి ఒడ్డుకు సమీపంలోనే ఉన్నారు. చిన్న బోటులు పంపి ఒడ్డుకు తీసురావాలి. వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి’’ అని విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి పేర్కొన్నారు.






