- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీళ్లు మమ్మల్ని బతకనిస్తారా.. చంపేస్తారా..?
వీళ్లు మమ్మల్ని బతకనిస్తారా.. లేక చంపేస్తారా..? అంటూ రైతులు ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, ఆసిఫాబాద్ : వీళ్లు మమ్మల్ని బతకనిస్తారా.. లేక చంపేస్తారా..? అంటూ రైతులు ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సుర్దాపూర్ గ్రామ శివారులో సుమారు 150 హెక్టార్ల భూమిని స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటేందుకు సోమవారం ట్రెంచ్ తవ్వకాలు చేపట్టారు. ఈ పనులను అడ్డుకునేందుకు రైతులు అక్కడికి వెళ్లగా పోలీసులు వారిని నిలువరించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తోపులాటలో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మేము గత 50 ఏళ్లుగా ఈ భూములను సాగు చేస్తున్నాం.
మా జీవనాధారం ఈ భూములే. మా సాగు భూములను లాక్కొని, పోలీసులను పెట్టి మమ్మల్ని బయటకు గెంటేస్తున్నారు. ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అంటూ ఫారెస్ట్ అధికారుల తీరు పై మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ భూములను తిరిగి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయం పై ఫారెస్ట్ అధికారులను వివరణ కోరగా, గత కొన్నేళ్లుగా రైతులు అటవీ భూమిని అక్రమంగా సాగు చేస్తున్నారని తెలిపారు. వారి వద్ద ఎలాంటి హక్కు పత్రాలు లేవని పేర్కొన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారమే 150 హెక్టార్ల భూమిని స్వాధీనం చేసుకుని, భూమి చుట్టూ ట్రెంచ్ తవ్వినట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు.






