- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్వహణకు ప్రతిపాదనల ఆహ్వానం : మంత్రి జనార్దన్ రెడ్డి
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్వహణకు ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి జనార్దన్ రెడ్డి ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్వహణకు ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి జనార్దన్ రెడ్డి ప్రకటించారు. హార్బర్ నిర్వహణలో కేరళ, తమిళనాడు విధానాలను స్టడీ చేసి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రైవేటు కంపెనీలు సమర్థవంతంగా హార్బర్ ను నిర్వహించి, మత్స్యకారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. హార్బర్లో పరిశుభ్రత, భద్రత, ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్ నిర్వహణ, మత్స్యకారులకు మంచి ధర, అధిక ఆదాయం రావడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రూ.306 కోట్లతో 95.5 శాతం ఫిషింగ్ హార్బర్ పనులను పూర్తి చేయనున్నట్లు మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. జువ్వలదిన్నె హార్బర్ వల్ల 6100 మంది మత్స్యకారులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. ఫలితంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయన్నారు.
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన ఫిషింగ్ హార్బర్లలో ప్రైవేట్ భాగస్వామ్యం వల్ల నిర్వహణ వ్యయం తగ్గడమే కాకుండా, మౌలిక వసతులు సక్రమంగా సాగుతున్నాయి. అదే విధానాన్ని ఇక్కడ అమలు చేయడం ద్వారా ప్రభుత్వానికి అదనపు భారం పడకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో హార్బర్‌ను మెయింటైన్ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మత్స్యకారులు వేటాడి తెచ్చిన చేపలు, రొయ్యలు పాడవకుండా నిల్వ ఉంచేందుకు అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ లింకేజీలు. పట్టుకొచ్చిన వేటను పారదర్శకంగా వేలం వేసుకునేందుకు వీలుగా డిజిటలైజ్డ్ వేలం షెడ్లు, బోట్లకు అవసరమైన డీజిల్ బంకులు, సర్వీసింగ్ సెంటర్లు ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. ఫిషింగ్ హార్బర్లలో సాధారణంగా ఉండే కాలుష్యం, కంపు లేకుండా ఎప్పటికప్పుడు వ్యర్థాల నిర్వహణ (Waste Management) ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.






