- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టు దర్శనం ముగించుకుని వస్తుండగా ప్రమాదం
by velandi.Saikiran |
కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.

X
దిశ, కొడిమ్యాల : కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. అప్పారావుపేట ఆర్‌అండ్‌బీ బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన పోకల మధుకర్ (30), తన స్నేహితుడు యశోద అనిల్‌తో కలిసి టీవీఎస్ జూపిటర్‌పై వస్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన టవేరా వాహనం ఢీకొట్టింది. దీంతో మధుకర్ వాహనం పై నుంచి ఎగిరిపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి పోకల భూమయ్య ఫిర్యాదు మేరకు టవేరా డ్రైవర్ జీకూరు తిరుపతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొడిమ్యాల ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.
Next Story






