- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎదురెదురుగా ఢీకొన్న కారు, స్కూటీ.. ఇద్దరు మృతి
by Taduka Kalyani |
మాడ్గుల మండలం అన్నే బోయిన్ పల్లి గ్రామ శివారులోని హరిహర కళాక్షేత్రం సమీపంలో సాగర్ హైవే పై సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.

X
దిశ, మాడ్గుల : మాడ్గుల మండలం అన్నే బోయిన్ పల్లి గ్రామ శివారులోని హరిహర కళాక్షేత్రం సమీపంలో సాగర్ హైవే పై సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ప్రమాదంలో ఏపీ మార్కాపురం జిల్లా రాయవరం గ్రామానికి చెందిన వెనుకొండ బాబు, బుర్రి బాబు లు అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ వేణుగోపాలరావు కథనం ప్రకారం.. రాయవరం గ్రామానికి చెందిన మృతులు సాగర్ హైవే పై చింతపల్లి వైపు స్కూటీ పై వెళ్తుండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీ కొన్నట్లు ఆయన వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించి సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Next Story






