- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ వ్యవహారంలో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆరోపణలు నేపథ్యంలో రాజీనామా చేసిన చంపత్ రాయ్ స్థానంలో ట్రస్ట్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం జరిగిన అత్యున్నత స్థాయి అత్యవసర సమావేశంలో ట్రస్ట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఆస్తికర విషయమేంటంటే.. అయోధ్య ఆలయ విరాళాల నిధుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, హుండీ ఆదాయానికి గండి పడుతోందని మొదటిగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది కృష్ణమోహనే. ఆయన ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగానే అయోధ్య పోలీసులు, సిట్ అధికారులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాయి. విరాళాల దొంగతనాన్ని బయటపెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఆయనకే ఇప్పుడు ట్రస్ట్ తాత్కాలికంగా అత్యున్నత పరిపాలనా బాధ్యతలను అప్పగించడం విశేషం. పూర్తి స్థాయి దర్యాప్తు ముగిసి, కొత్త శాశ్వత కార్యదర్శిని ఎన్నుకునే వరకు కృష్ణమోహన్ ఈ పదవిలో కొనసాగనున్నారు.






