- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ పేరుతో మైనర్‌పై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్‌కు మెదక్ జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

దిశ, చేగుంట: ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్‌కు మెదక్ జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి రూ.1 లక్ష విక్టిమ్ కాంపెన్సేషన్ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. రజాక్ (27) అనే ఆటో డ్రైవర్ మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో వివాహం చేసుకున్నప్పటికి బాధితురాలిని కూడా పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా 2020 అక్టోబరులో అప్పటి చేగుంట ఎస్ఐ సుభాష్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
అప్పటి తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య బలమైన వాదనలు వినిపించగా చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి, లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ కృష్ణ, భరోసా లీగల్ అడ్వైజర్ శ్వేత కేసు విచారణలో సమన్వయంతో పనిచేసి సహకారం అందించారు. విచారణ అనంతరం మెదక్ జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీమతి ఆర్.ఎం. శుభవాలి నిందితుడు రజాక్‌కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ.1 లక్ష విక్టిమ్ కాంపెన్సేషన్ అందించాలని ఆదేశించినట్టు తెలిపారు .ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మహిళలు, బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై చట్టం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి కేసును శాస్త్రీయంగా దర్యాప్తు చేసి నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా మెదక్ జిల్లా పోలీసులు కట్టుబడి పని చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని వారికి పూర్తి రక్షణతో పాటు చట్టపరమైన సహాయం అందిస్తామని తెలిపారు.






