- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రెయిన్‌డెడ్ తో భర్త మృతి.. ఐదుగురికి ప్రాణదానం చేసిన భార్య
భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ భార్య తీసుకున్న గొప్ప నిర్ణయం ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది.

దిశ, శంషాబాద్: భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ భార్య తీసుకున్న గొప్ప నిర్ణయం ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. శంషాబాద్ మండలం సిద్ధంతికి చెందిన రాచమల్ల రవికుమార్ (48) బ్రెయిన్‌డెడ్ కావడంతో ఆయన అవయవాలను దానం చేసి కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. రవికుమార్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ భార్య అరుంధతి, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. జూలై 1న ఇంట్లో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల చికిత్స అనంతరం జూలై 3న వైద్యులు ఆయనను బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. భర్త మరణాన్ని తట్టుకోలేని పరిస్థితిలోనూ భార్య అరుంధతి అవయవదానానికి అంగీకరించింది. ఎస్ ఓ టి టి ఓ–జీవదాన్ సమన్వయంతో రవికుమార్‌కు చెందిన రెండు కిడ్నీలు, ఒక లివర్, రెండు కార్నియాలను దానం చేయగా, వాటితో ఐదుగురి కొత్త జీవితం లభించింది. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ జీవదాన్ అధికారులు రవికుమార్ కుటుంబ సభ్యుల మానవత్వాన్ని అభినందించారు. ఓ కుటుంబం విషాదంలో మునిగిపోయినా, వారి నిర్ణయం మరో ఐదు కుటుంబాల్లో ఆశలు చిగురింపజేసిందని పేర్కొన్నారు.






