- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటో వద్దకే వెళ్లి సమస్య తెలుసుకున్న జిల్లా ఎస్పీ..
ఓ తల్లి తన సమస్యను చెప్పేందుకు వచ్చిన ఆమె వద్దకు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్వయంగా వచ్చి పిర్యాదును స్వీకరించారు.

దిశ, మెదక్ టౌన్: ఓ తల్లి తన సమస్యను చెప్పేందుకు వచ్చిన ఆమె వద్దకు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్వయంగా వచ్చి పిర్యాదును స్వీకరించారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కారుణ్య నియామకం ద్వారా పెద్ద కుమారుడి కి ఉద్యోగం ఇప్పించిన అనంతరం, తన బాగోగులు పట్టించుకోకుండా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ క్యాన్సర్‌తో బాధపడుతూ, నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలు రావడం జరిగింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు స్వయంగా ఆటో వద్దకు వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెదక్ టౌన్ సీఐ మహేష్ ను జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి, వృద్ధురాలి ఫిర్యాదు పై వెంటనే విచారణ చేపట్టి, వాస్తవాలను నిర్ధారించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం, వేధింపులను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారని, తల్లిదండ్రుల సంక్షేమాన్ని చూడటం ప్రతి సంతానం బాధ్యత అని పేర్కొన్నారు. వృద్ధులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా జిల్లా పోలీసులను ఆశ్రయించాలని, వారికి చట్టపరంగా పూర్తి సహాయం అందిస్తామని తెలిపారు.






