- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్పత్తి లక్ష్యాల సాధనకు భద్రతతో కూడిన సమష్టి కృషి అవసరం
బొగ్గు పత్తి లక్ష్యసాధనకు భద్రతతో కూడిన సమిష్టి కృషి అవసరమని సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-2 ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య అన్నారు.

దిశ, యైటింక్లయిన్ కాలనీ: బొగ్గు పత్తి లక్ష్యసాధనకు భద్రతతో కూడిన సమిష్టి కృషి అవసరమని సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-2 ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య అన్నారు. సోమవారం ఏరియాలోని ఓసీపీ-3 షావల్ సెక్షన్‌కు నూతనంగా కొనుగోలు చేసిన నాలుగు 12 టన్నుల సామర్థ్యం గల క్రేన్‌లను ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఆధునిక యంత్రాలను సమర్థవంతంగా వినియోగించి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సూచించారు.
ప్రతి కార్మికుడు తన భద్రతతో పాటు యంత్రాల భద్రతను సైతం కాపాడుతూ ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సాంబశివరావు, ఎస్‌వో టు జీఎం రాముడు, ఏరియా ఇంజనీర్ సుజన్ మెహ్రా, పీఓ ఉదయ్ హరిజన్, ఏజీఎం (ఐఈడీ) చంద్రశేఖర్, ఏరియా సేఫ్టీ అధికారి సత్యనారాయణ, డీజీఎం (ఫైనాన్స్) రామచంద్ర, ఇన్‌చార్జి పీఈ నాగేశ్వరరావు, మేనేజర్ సంపత్ కుమార్, సీఎంఓఏఐ ప్రతినిధి పొనుగోటి శ్రీనివాస్‌తో పాటు వివిధ విభాగాల హెచ్‌వోడీలు, యూనియన్ నాయకులు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






