- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రావణ్‌లో మావోయిస్టు భావజాలం.. వెలుగులోకి సంచలన విషయాలు
ప్రశ్న రావణ్‌లో మావోయిస్టు భావజాలం ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన్ను రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే..

దిశ, వెబ్ డెస్క్: ప్రశ్న రావణ్(Ravan)లో మావోయిస్టు భావజాలం(Maoist ideology) ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన్ను రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే రిమాండ్ రిపోర్టులో పొందుపర్చిన కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. రావణ్ ఫోన్‌ను పరిశీలించడంతో అందులో మావోయిస్టు భావజాలం ఉన్నట్లు తాము గుర్తించామని తెలిపారు. అలాగే మావోయిస్టు హిడ్మాను రావణ్ కీర్తిస్తూ ప్రసంగించిన వీడియోలు సైతం ఫోన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు హిందూ దేవుళ్లే టార్గెట్‌గా రావణ్ పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేవుళ్లను కించపర్చడం, అవమానించడంలో భాగంగానే తాను రావణ్ అనే పేరు పెట్టుకున్నారని వివరించారు. మత, కుల పరమైన విభేదాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రసంగాలు, పదవుల్లో ఉన్న వారిని దూషించడం, వ్యవస్థలపై ద్వేషం కలిగించేలా రావణ్ తీరు ఉందని తెలిపారు. అంతేకాదు అసలు రావణ్‌కు సహకరిస్తున్న వారెవరో కూడా తేలాల్సి ఉందని, విచారణకు కూడా ఆయన సహకరించలేదని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ప్రశ్న రావణ్‌కు రిమాండ్
కాగా యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను పవన్ కల్యాణ్‌పై చేసిన అసభ్య కామెంట్స్ కేసులో గన్నవరం కోర్టులో ప్రవేశ పెట్టడంతో ధర్మాసనం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనపై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఉపా సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన ఈ కేసులో రావణ్‌ను అరెస్ట్ చేసి ఈ నె 18 వరకు విధించిన రిమాండ్ నేపథ్యంలో పోలీసులు జైలుకు తరలించారు.






