ఏపీ లిక్కర్‌ కేసు: రాజ్‌కేసిరెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా

by Vemula.Srinu Prasad |

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు రాజ్ కేసిరెడ్డి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు...

ఏపీ లిక్కర్‌ కేసు: రాజ్‌కేసిరెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ రవాణా స్కామ్ కేసు(Andhra Pradesh liquor transportation scam case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు రాజ్ కేసిరెడ్డి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.

కోర్టులో ఈడీ పిటిషన్

కాగా ఈ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వాసుదేవ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, కారుమూరి సునీల్‌లను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. కేసులో లోతైన అంశాలను, ఆర్థిక లావాదేవీలను వెలికితీసేందుకు నిందితులను వారం రోజుల పాటు విచారించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌పై కోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయో చూడాలి.

Next Story