ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి : కలెక్టర్

by Taduka Kalyani |

ప్రజావాణి కార్యక్రమంలో అందుతున్న ప్రతి ఫిర్యాదును అధికారులు సత్వరంగా, పారదర్శకంగా పరిష్కరించడానికి చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి : కలెక్టర్
X

దిశ, సంగారెడ్డి అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో అందుతున్న ప్రతి ఫిర్యాదును అధికారులు సత్వరంగా, పారదర్శకంగా పరిష్కరించడానికి చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి వివరాలను తెలుసుకుని సంబంధిత శాఖల జిల్లా అధికారులకు వినతులను అందజేసి తగిన సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో డివిజన్ వారీగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో మొత్తం 66 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వాటిలో జిల్లా కలెక్టరేట్‌లో 35, సంగారెడ్డి డివిజన్‌లో 13, ఆందోల్ డివిజన్‌లో 0, నారాయణఖేడ్ డివిజన్‌లో 6, జహీరాబాద్ డివిజన్‌లో 12 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story