- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సట్లుజ్’ వివాదంపై స్పందించిన హీరో.. ఒకసారి ఇంటర్నెట్‌లోకి వచ్చాక ఎవరూ అడ్డుకోలేరంటూ స్ట్రాంగ్ కౌంటర్
ఇలా జరుగుతుందని తమకు ముందే తెలుసని, అందుకే సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా సీక్రెట్‌గా రిలీజ్ చేశామని చెప్పారు.

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో దిల్జీత్ దోసాంజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సట్లుజ్’. పంజాబ్‌లోని మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రాన్ని హనీ టెహ్రన్ తెరకెక్కించారు. ఇందులో అర్జున్ రాంపాల్, సువీందర్ విక్కీ కీలక పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రం 1990లలో పంజాబ్‌లో జరిగిన 25,000 మిస్సింగ్ కేసుల అదృశ్యం వెనుక ఉన్న వాస్తవాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే 2022లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ సెన్సార్ సమస్యలు, కోర్ట్ కేసులు, ఆర్థిక ఇబ్బందులు, టైటిల్ వివాదాల వంటి కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. అయితే నాలుగేళ్ల తర్వాత సడెన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. కానీ ఈ సినిమాపై వివాదం తలెత్తడంతో.. స్ట్రీమింగ్ అయిన రెండు రోజులకే నిలిపివేయడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సినిమాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చట్టపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత మళ్లీ స్ట్రీమింగ్ చేస్తామని జీ5 ప్రకటించింది. తాజాగా, ఈ వివాదంపై హీరో దిల్జీత్ దోసాంజ్ ఇన్‌స్టా్గ్రామ్ ద్వారా రియాక్ట్ అవుతూ.. ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు.
ఇలా జరుగుతుందని తమకు ముందే తెలుసని, అందుకే సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా సీక్రెట్‌గా రిలీజ్ చేశామని చెప్పారు. ఒకవేళ ముందే అనౌన్స్ చేసి ఉంటే అసలు మూవీ విడుదలై ఉండేదే కాదని అభిప్రాయపడ్డారు. సోమవారం ఆఫీసులు తెరిచాక ఈ చిత్రాన్ని బ్యాన్ చేస్తారేమో అనుకున్నామని, కానీ ఆదివారం సాయంత్రమే తీసేస్తారని ఊహించలేదన్నారు. 1995లో జరిగిన ఆ ఘటన గురించి అప్పట్లో మాట్లాడనివ్వలేదని, ఇప్పుడు 2026లో కూడా అదే జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, సినిమాను అప్పటికే చాలా మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని, ఒకసారి ఇంటర్నెట్‌లోకి వచ్చిన దాన్ని ఎవరూ ఆపలేరని దిల్జిత్ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ఒక గురుద్వారాలో, అలాగే రాజస్థాన్‌లో ప్రజలు ఈ సినిమాను చూస్తున్న వీడియోలు చూసి తనకు ఎంతో తృప్తి కలిగిందని చెప్పారు. ఈ మూవీని డౌన్‌లోడ్ చేసిన వారంతా ఇతరులతో షేర్ చేసుకుని, ఈ కథను సజీవంగా ఉంచాలని కోరారు. తన ప్రాణం ఉన్నంతవరకు తాను పంజాబ్‌కే అండగా ఉంటానని దిల్జిత్ దోసాంజ్ చెప్పుకొచ్చారు.






