- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ కట్టిందని కన్నేపల్లి నుంచి నీటిని ఆపొద్దు.. కాళేశ్వరంపై ఈటల సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నెపల్లి పంపింగ్ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ ఈ పంప్ హౌస్ వినియోగంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కన్నెపల్లి నుంచి నీటిని తీసుకువచ్చని ఇలాంటి సమయంలో భేషజాలకు పోవద్దని ఇప్పుడు కావాల్సింది విమర్శలు, ప్రతివిమర్శలు కాదని నీళ్లు కాలన్నారు. గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు కాబట్టి దానిని ఆపరేట్ చేయొద్దనుకోవడం సరికాదన్నారు. కాళేశ్వరంపై విచారణ జరిపించండి. దోషులను శిక్షించండి కానీ ప్రజలను కాదని రైతులను శిక్షించే అధికారం రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ కార్యాలయంలో శ్యామాప్రసాద ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ఈటల ఈ సందర్భంగా మాట్లాడారు.
మూర్ఖంగా వ్యవహరించవద్దు:
కాళేశ్వరంపై కమిటీలు, కమీషన్ల రూపంలో చర్చోపచర్చలు జరిగాయి అవి పక్కన పెడితే కన్నెపల్లిపై ఉన్న అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి డ్యాములు, పంప్ హౌస్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయన్నారు. కన్నేపల్లి పంప్ హౌస్‍లో 50 వేల క్యూసెక్కుల నీళ్లు వచ్చిన పంప్ హౌస్ లోపలికి నీళ్లు వస్తాయి. వాటిని పంప్ చేయవచ్చన్నారు. ఇప్పుడు లక్ష క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.. మరోపక్క కరువు రాబోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిది తప్పు.. ఎవరు దుర్మార్గులు.. అని చర్చ పెట్టకుండా.. కోట్ల రూపాయలతో కట్టబడ్డ ప్రాజెక్టులను ఉపయోగించుకోవాలన్నారు. వర్షాలు లేక రైతు విత్తనాలు కూడా వేసుకోలేని పరిస్థితి ఉందని హైదరాబాదు లాంటి నగరాలు తాగే నీటి కోసం కృష్ణా గోదావరి మీదనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి నీళ్లను పంప్ చేయాలని డిమాండ్ చచేశారు. ప్రాజెక్టు కుంగిపోయింది, నీళ్లు నిలవనిది వాస్తవం. కానీ కన్నేపల్లి కెపాసిటీ 2 TMC లు అంటే ఇరవై ఐదు వేల క్యూసెక్కుల నీళ్లు వస్తె పని చేస్తాయి కాబట్టి వెంటనే పంపింగ్ మొదలు పెట్టాలన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు అన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి విశాల దృక్పథంతో ఆలోచన చేయాలన్నారు.
ఎప్పుడు ఎన్నికలొచ్చినా రేవంత్ కు ఓటమే:
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఎప్పుడు ఎన్నికలొచ్చినా రేవంత్ ఓడిపోతాడని ప్రజలంటున్నారన్నారు. Ghmc ఎన్నికల్లో హైడ్రాకు మూల్యం చెల్లించుకోబోతున్నారు. రేవంత్ రెడ్డికి చాలా క్లారిటీ ఉందని ఆయన అమెరికా గడ్డమీద నిలబడి అబద్దాలు చెప్తేనే ప్రజలు ఇష్టపడతారు.. అబద్ధాలు చెప్పే నాయకులనే ప్రజలు బలపరుస్తారు అని చెప్పారు. దానికి పరాకాష్ట.. హైడ్రా అనే పదం నేను హిట్లర్ నుంచి తీసుకున్నాను అని ఆయన చెప్పడమే అన్నారు. దీన్ని బట్టే ఆయన నైజం అర్థం చేసుకోవాచ్చన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు పేదవాళ్లకు ఇంటి జాగాలను ఇళ్లను ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి విధానం వేరు. పేదవాళ్ల ఇళ్లను కూలగొట్టడం, ఆనాటి ప్రభుత్వాలు ఇచ్చిన జాగాలు గుంజుకొని పెద్దవాళ్లకు అంటగట్టడమే ఆయన ఎజెండా అన్నారు. హిట్లర్ కు వారసత్వం అని చెప్పుకుంటున్న హైడ్రా ప్రజలకు న్యాయం చేస్తుందనుకోవడం మన తప్పు అన్నారు. నేను హైడ్రాను వ్యతిరేకించిన మొదట్లో చాలామంది ఈటల రాజేందర్ ఏంటి ఈ విధంగా చేస్తున్నారని ప్రశ్నించారు.. కానీ ఒంటరిగా నాలుగు నెలల పాటు కొట్లాడిన తర్వాత.. హైడ్రా నిజస్వరూపం అందరికీ తెలిసింది. ఇప్పుడు కోర్టు కూడా అదే చెప్పిందన్నారు. రంగనాథ్ నాకు ఏ చట్టంతో, కోర్టులతో సంబంధం లేదు. నన్ను ఎవరు నిలువరించలేరని చెప్పి ఆయన వ్యవహరిస్తున్న తీరుపట్ల కోర్టు కూడా అనేకసార్లు మందలించిందన్నారు.
బీజేపీకి పక్షపాతం లేదు:
కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి పక్షపాతం లేదని ఈటల అన్నారు. కావాలని దుర్మార్గమైన దుష్ప్రచారం చేస్తున్నారని మీడియా చేతిలో ఉందని పిచ్చి అబద్ధాలు ప్రచారం చేయకండి అన్నారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మెట్రో త్వరగా మొదలుపెట్టాలన్నారు. శామీర్ పేట వైపు, మేడ్చల్ వైపు, ఎయిర్పోర్ట్ వైపు, ఫోర్త్ సిటీ వైపు మెట్రో వేయడానికి మేము వ్యతిరేకం కాదు.. కానీ పద్ధతి ప్రకారం చేయండి అని కోరుతున్నామన్నారు. ఫేస్ వన్ లో 13 వేల కోట్ల రూపాయలు, పేస్ టూ 40 వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మెట్రో త్వరగా పూర్తి చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా, మంత్రులుగా పూర్తిస్థాయి సహకారం అందిస్తాము. ట్రిపుల్ ఆర్ రోడ్డు ఇచ్చింది కేంద్రం కాదా?






