- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెక్సికోపై ఇంగ్లాండ్ థ్రిల్లింగ్ విక్టరీ.. క్వార్టర్ ఫైనల్లోకి ‘త్రీ లయన్స్’
ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఇంగ్లండ్ థ్రిల్లింగ్ విక్టరీ. మెక్సికోపై 3-2తో గెలిచి క్వార్టర్స్ చేరిన త్రీ లయన్స్.

దిశ, వెబ్ డెస్క్; ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన రౌండ్ ఆఫ్ 16 (Round of 16) నాకౌట్ పోరులో ఇంగ్లండ్ జట్టు అద్భుత విజయం సాధించింది. ఆతిథ్య మెక్సికో జట్టుతో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 3-2 గోల్స్ తేడాతో గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ ముగిసేవరకు ఇరు జట్లూ నువ్వా-నేనా అన్నట్లు తలపడటంతో స్టేడియంలో ఉత్కంఠ పీక్స్‌కు చేరింది. అయితే, ఇంగ్లండ్ యువ స్టార్ మిడ్‌ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ (Jude Bellingham) వరుసగా 36వ నిమిషంలో, ఆపై 38వ నిమిషంలో రెండు బ్యాక్-టు-బ్యాక్ గోల్స్ చేసి ఇంగ్లండ్‌ను 2-0 ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత 42వ నిమిషంలో మెక్సికో ప్లేయర్ జూలియన్ ఒక గోల్ కొట్టి స్కోరును 2-1కి తగ్గించాడు.
సెకండ్ హాఫ్‌లో మ్యాచ్ మరింత మలుపు తిరిగింది. 54వ నిమిషంలో ఇంగ్లాండ్ డిఫెండర్ జారెల్ క్వాన్సా (Jarell Quansah) రెడ్ కార్డ్ ప్లేట్ అయి మైదానం వీడటంతో ఇంగ్లాండ్ కేవలం 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఈ క్రమంలో 60వ నిమిషంలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ (Harry Kane) పెనాల్టీని గోల్‌గా మార్చి జట్టు స్కోరును 3-1కి చేర్చాడు. ఆ తర్వాత 69వ నిమిషంలో మెక్సికోకు కూడా పెనాల్టీ లభించగా, రౌల్ జిమెనెజ్ దానిని విజయవంతంగా గోల్ చేసి ఉత్కంఠ రేపాడు (3-2). చివరి నిమిషాల్లో మెక్సికో జట్టు ఈక్వలైజర్ గోల్ కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ.. ఎజ్రి కొన్సా (Ezri Konsa) నేతృత్వంలోని ఇంగ్లాండ్ డిఫెన్స్ విభాగం ప్రాణాలొడ్డి అడ్డుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్ జూలై 11న మయామిలో జరగబోయే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నార్వే జట్టుతో తలపడనుంది.






