ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. జీవో జారీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-06 10:49:26  IST  )

రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగుల్లో లోకల్ కేడర్ నిర్ధారణకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 28 జిల్లాల్లో మార్కాపురం, పోలవరం జిల్లాలను మినహాయించింది. మొత్తం 6 జోన్లు, 2 మల్టీ జోన్లగా విభజన చేసింది. ఈ రెండు జోన్లను మూడేసిగా విభజించింది. ...

ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. జీవో జారీ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో లోకల్ కేడర్ నిర్ధారణకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 28 జిల్లాల్లో మార్కాపురం, పోలవరం జిల్లాలను మినహాయించింది. మొత్తం 6 జోన్లు, 2 మల్టీ జోన్లగా విభజన చేసింది. ఈ రెండు జోన్లను మరో మూడేసిగా విభజించింది. మల్టీ జోన్లు, జోన్ల ప్రకారం ఉద్యోగుల కేడర్ విభజన చేయాలని ప్రభుత్వం భావించింది. కొత్త జిల్లాల్లో పరిస్థితి దృష్యా పోస్టులు అలాట్మెంట్లపై మార్గదర్శకాలు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ స్థాయి ఉద్యోగులను మల్టీ జోన్లకు కేటాయించింది. స్థానిక కేడర్ నిర్ధారణ అయ్యే వరకూ బదిలీలపై కూడా నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి ప్రమోషన్ల ఉండవని స్పష్టం చేసింది. జులై 5 వరకూ సెట్టింగ్స్ చేసుకుంది. ఇక ఈ బదిలీల నిషేధం అనేది ఎప్పటివరకూ అనే తేదీని త్వరలోనే ప్రకటించనుంది.

కొత్త జిల్లాల ఏర్పాటైన నేపథ్యంలో..

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటైన నేపథ్యంలో ‘‘స్థానిక కేడర్ ఉద్యోగులు ఎక్కడ పని చేయాలి, జిల్లాల్లో అదనంగా ఉద్యోగుల ఉంటే ఎలా సర్దుబాటు చేయాలి. ప్రమోషన్లకు సంబంధించిన నిర్ణయాన్ని కూడా ఎలా తీసుకోవాలి ’’అనే అంశాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ఆధారంగా ఉద్యోగుల కేడర్ నియామకం జరుగుతుంది. ఈ నియామకాల తర్వాతే బదిలీలు, ప్రమోషన్లు, డిప్యూటేషన్లపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, లోక్ భవన్, అసెంబ్లీలో పని చేసే అధికారులు, ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. మొత్తం 26 జిల్లాల్లో 2025 ఉత్తర్వుల ప్రకారం ఈ కేడర్ నియామకం జరగనుంది. ఈ నియామకాల తర్వాత బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6 జోన్లలో ఉద్యోగుల విభజన జరగాలనే డీటేయిల్డ్ ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలోనే జారీ చేసే అవకాశం ఉంది.

Next Story