- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్య విరాళాల చోరీ కేసు.. చంపత్‌రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలకు ఆమోదం
అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం, నిధుల చోరీ ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం, నిధుల చోరీ ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా రాజీనామాలను ట్రస్ట్ బోర్డు ఆమోదించింది. సోమవారం ఆలయ ప్రాంగణంలోని గెస్ట్ హౌస్ లో జరిగిన అత్యున్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చంపత్ రాయ్ స్థానంలో విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి, చార్టర్డ్ అకౌంటెంట్ భజరంగ్ లాల్ బాగ్రాను కొత్త ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా నియమించారు.
రామమందిర నిర్మాణానికి వచ్చిన నిధుల అక్రమాలపై యూపీ ప్రభుత్వం సిట్ వేసిన విషయం తెలిసిందే. విరాళాల దుర్వినియోగంపై సిట్ విచారణను వేగవంతం చేసింది. సిట్ జరుపుతున్న దర్యాప్తుపై తమకు పూర్తి నమ్మకం ఉందని ట్రస్ట్ స్పష్టం చేసింది. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష తప్పదని ట్రస్ట్ అధ్యక్షుడు మహంత నృత్య గోపాల్ దాస్ పేర్కొన్నారు. ట్విస్ట్ ఏంటంటే.. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను సిట్, అయోధ్య పోలీసులు ఇప్పటికే సుదీర్ఘంగా విచారించినప్పటికీ, ఇప్పటివరకు వారిపై ఎలాంటి ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు కాలేదు. కేవలం నైతిక బాధ్యత వహిస్తూనే వారు తమ పదవులకు రాజీనామా చేశారు.
డ్రైవర్‌తో సహా ఎనిమిది మంది అరెస్ట్ఈ నిధుల చోరీ వ్యవహారంలో చంపత్ రాయ్ అత్యంత ఆప్తుడు, ఆయన మాజీ డ్రైవర్ అయిన రమాశంకర్ అలియాస్ టిన్ను యాదవ్‌తో పాటు హుండీ నగదు లెక్కింపు ప్రక్రియలో ఉన్న ఎనిమిది మంది సిబ్బందిని సిట్ ఇప్పటికే అరెస్ట్ చేసింది. హుండీ లెక్కింపు గదిలోని సీసీటీవీ కెమెరాలకు అడ్డం పడుతూ, అత్యంత తెలివిగా నోట్ల కట్టలను దొంగిలించి బాత్‌రూమ్‌లలో దాచి, ఆపై బయటకు తరలించేవారని సిట్ దర్యాప్తులో తేలింది.






