- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతన్ని సమర్థించం.. చర్యనే తప్పుబడుతున్నాం: తోట త్రిమూర్తులు
విజయవాడ కృష్ణలంక పీఎస్‌లో లాకప్ డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని వైసీపీ కాపు నేతలు పరామర్శించారు..

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కృష్ణలంక పీఎస్(Vijayawada Krishnalanka Police Station)లో లాకప్ డెత్(Custodial death)కు గురైన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి(Gade Saikrishna's mother Vijayalakshmi)ని వైసీపీ కాపు నేతలు పరామర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని నివాసానికి వెళ్లి ఆమెకు రూ. 20 లక్షల ఆర్థికసాయం అందజేవారు. ఈసందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ సాయికృష్ణ చేసిన పనిని తాము సమర్థించమని చెప్పారు.
తప్పుబడుతున్నాం..
అయితే పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఘటనను మాత్రమే తాము తప్పుబడుతున్నామని తెలిపారు. సాయికృష్ణను లాకప్ డెత్ చేయడం దారుణమని మండిపడ్డారు. కేసు విచారణను కూడా తప్పుబడుతున్నామన్నారు. సాయికృష్ణ కుటుంబానికి చట్ట పరమైన న్యాయం జరగాలన్నారు. చనిపోయిన వ్యక్తికి తీసుకురావడం ఎవరి తరంకాదన్నారు. సాయికృష్ణ ముద్దాయి అయినంత మాత్రాన బూడిద చేస్తారా అని ప్రశ్నించారు. సీఐ నాగరాజును మాత్రమే ముద్దాయిని చేశారని, కానీ ఘటన వెనుక పై అధికారులు ఉన్నారని తోట త్రిమూర్తులు అనుమానం వ్యక్తం చేశారు. సీపీతో సహా ఉన్నతాధికారులను తప్పించారని ఆరోపించారు. సాయికృష్ణ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు. సాయికృష్ణను తీసుకొచ్చి చంపిన వాళ్లందరికీ శిక్షి పడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తోట త్రిమూర్తులు తెలిపారు.






