చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక మలుపు.. కారులో వ్యక్తులపై అనుమానం..!

by Vemula.Srinu Prasad |

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలకమైన మలుపు చోటుచేసుకుంది. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన రోజున ఆ ప్రాంతంలో అనుమానాస్పద కారు తిరిగినట్లు వెలుగులోకి వచ్చింది....

చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక మలుపు.. కారులో వ్యక్తులపై అనుమానం..!
X

దిశ, వెబ్ డెస్క్: చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలకమైన మలుపు చోటుచేసుకుంది. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన రోజున ఆ ప్రాంతంలో అనుమానాస్పద కారు తిరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ కారుతో పాటు అందులో ఉన్న వ్యక్తుల ప్రవర్తనపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. నర్సీపట్నం సమీపంలో చిన్నారి తాతను కారు ఢీకొట్టిందన్నారు. వారి ఆనవాళ్లను, కారు కదలికలను ఆధారంగా దర్యాప్తు చేయాలని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు కోరారు. దీంతో పోలీసులు ఆ అనుమానాస్పద కారును గుర్తిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తుననారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని అధికారులు చెబుతున్నారు.

Next Story