- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ డ్రైవర్ బ్యాగ్ చోరీ...కీలక పత్రాలు అపహరణ
కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపోకు చెందిన కంబదూరు నైట్ అవుట్ బస్సులో చోరీ ఘటన చోటుచేసుకుంది.....

దిశ, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపోకు చెందిన కంబదూరు నైట్ అవుట్ బస్సులో చోరీ ఘటన చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ మంజు విధులు ముగించుకుని తన వ్యక్తిగత వస్తువులు, దుస్తులు, ముఖ్యమైన పత్రాలను బ్యాగులో ఉంచి బస్సులోనే నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బ్యాగును అపహరించినట్లు సమాచారం. డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం, బ్యాగులో షర్టు జేబులో ఉంచిన నగదుతో పాటు పాన్ కార్డు, ఆధార్ కార్డు, ద్విచక్ర వాహనం ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ముఖ్యమైన పత్రాలు ఉన్నాయని, వాటన్నింటినీ దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
ఈ ఘటనపై డ్రైవర్ మంజు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో రాత్రి వేళల్లో బస్సు స్టాండ్లు, నైట్ అవుట్ బస్సుల వద్ద పోలీసులు మరింత గస్తీ నిర్వహించాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు. విలువైన వస్తువులు, అధికారిక పత్రాలను బస్సుల్లో ఉంచే ఉద్యోగులకు తగిన భద్రత కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.






