10 రోజుల పాటు సినీ ఫక్కీలో అపరేషన్..

by Taduka Kalyani |

హైదరాబాద్ లో డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు హైదరాబాద్ పోలీసులు ఓ సాహోసోపేత ఆపరేషన్ ను చేపట్టిన సీన్ ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది

10 రోజుల పాటు సినీ ఫక్కీలో అపరేషన్..
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ లో డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు హైదరాబాద్ పోలీసులు ఓ సాహోసోపేత ఆపరేషన్ ను చేపట్టిన సీన్ ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. హైదరాబాద్ హెచ్ న్యూ పోలీసులకు ఇటీవల గంజాయి దందాకు సంబంధించిన ఓ కీలక సమాచారం అందింది. ప్రాథమిక విచారణలో ఈ గంజాయి దందాను ఎవరి కంట పడకుండా స్పీడ్ పోస్టు ద్వారా నడిపిస్తున్నారని పోలీసులు పసిగట్టారు. అయితే ఈ స్పీడ్ పోస్టు గంజాయి దందాను జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామం నుంచి నడుస్తుందని గుర్తించారు. ఏలాగైనా ఈ దందాకు కట్టడి చేయాలని ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు ప్రధాన సూత్రధారిని పట్టుకుంటే మొత్తం నెట్ వర్క్ మీద దెబ్బ కొట్టవచ్చని డిసైడ్ చేసుకున్నారు.

వేషం మార్చారు..

అయితే పోలీసులుగా వెళ్ళితే స్పీడ్ గంజాయి ముఠా అప్రమత్తమై పారిపోయే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. దీంతో పోలీసులు ముందగా ఒక సుదీర్ఘ విచారణ జరిపి స్పీడ్ పోస్టు ద్వారా గంజాయి దందాను నిర్వహిస్తున్న ప్రధాన సూత్రధారి లొకేషన్ సమాచారాన్ని పక్కగా సేకరించారు. ఆపరేషన్ ను కీలకంగా చేపట్టిన హెచ్ న్యూ లోని టీం ముందుగా తమ వేషాన్ని మార్చుకున్నారు. దీని కోసం గడ్డం పెంచుకున్నారు. సాధారణ బట్టలను ధరించారు. రబ్బర్ చెప్పులను వేసుకున్నారు. అలా జార్ఖండ్ కు చేరుకుని ప్రధాన సూత్రధారి లొకేషన్ కు చేరుకుని అక్కడ 10 రోజుల పాటు సంచరించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని చాలా మంది వీరిని మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మీరు తమిళ, అంటూ పలు మార్లు ప్రశ్నించారు. దీనికి అవును అంటూ తల ఊపుతూ మాకు పని ఏదైనా దొరుకుతుందా అంటూ అక్కడే తిరుగుతూ ప్రధాన సూత్రధారి పై నజర్ పెట్టారు. పలు సందర్భాల్లో ప్రధాన సూత్రధారి సత్యం మిశ్రా దగ్గర వరకు వెళ్లారు. కానీ సత్యం మిశ్రా ఎప్పుడు తన అనుచరులతో ఉండడంతో అప్పుడు అతనిని పట్టుకోవడం సాధ్యం కాలేదు. నిరుత్సాహ పడకుండా నిరంతరం అతని పైనే నిఘా పెట్టారు. ఇలా 10 రోజులు దాటిన తర్వాత ఓ సందర్భం చిక్కగానే హెచ్ న్యూ పోలీసులు సత్యం మిశ్రాను రౌండప్ చేసి అదుపులోకి తీసుకుని బయలుదేరారు. కానీ అప్రమత్తమైన సత్యం మిశ్రా అనుచరులు స్థానికంగా మన వాడిని కిడ్నాప్ చేశారంటూ హాల్ చల్ చేశారు. మన పోలీసులు అతనిని తీసుకుని వాహనంలో బయలు దేరగానే పలు చెక్ పోస్టుల వద్ద ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుపడి ఎందుకు కిడ్నాప్ చేశారంటూ ప్రశ్నించారు. అపరేషన్ లో ఉన్న పోలీసులు స్పీడ్ పోస్టు ద్వారా గంజాయి దందా చేస్తున్న స్మగ్లర్ ను పట్టుకున్నామని తాము చట్టబద్దంగా అతనిని స్థానిక కోర్టులో హాజరుపర్చి హైదరాబాద్ కు తీసుకువెళ్తున్నామని చెప్పడంతో అక్కడి పోలీసులు కూడా సహకరించడంతో గంజాయి స్మగ్లర్ సత్యం మిశ్రా వ్యాపారానికి బ్రేక్ పడి అతనిని కటకటాల వెనక్కి పంపారు. ఇలా యువతను గంజాయి, డ్రగ్స్ నుంచి కాపాడేందుకు హైదరాబాద్ హెచ్ న్యూ పోలీసులు చేసిన ఈ అపరేషన్ ఇతర రాష్ట్రాల పోలీసుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాద్ పోలీసులు చేసిన ఈ అపరేషన్ తో దేశవ్యాప్తంగా నడుస్తున్న సత్యం మిశ్రా గంజాయి దందా నెట్ వర్క్ భగ్నమైంది. సత్యం మిశ్రాను హైదరాబాద్ కు తీసుకువచ్చి జైలుకు పంపిన విషయం అందరీకి తెలిసిందే.

Next Story