- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మణిపూర్‌లో ఉగ్రవాదుల దాష్టికం.. ఐఈడీ (IED) దాడిలో ఇద్దరు జవాన్లు మృతి
మణిపూర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఉఖ్రుల్‌లో అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఐఈడీ దాడి.. ఇద్దరు జవాన్లు అమరులు, పలువురికి గాయాలు!

దిశ, వెబ్ డెస్క్: మణిపూర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉఖ్రుల్ (Ukhrul) జిల్లా పరిధిలో విధుల్లో ఉన్న భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రమూకలు దాడికి తెగబడ్డారు. ఆ ప్రాంతం గుండా వెళ్తున్న అసోం రైఫిల్స్ (Assam Rifles) జవాన్ల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు శక్తివంతమైన ఐఈడీ (Improvised Explosive Device) బాంబును పేల్చారు. ఈ ఘోర ప్రమాదంలో బాంబు పేలుడు ధాటికి వాహనం తీవ్రంగా దెబ్బతినడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే వీరమరణం పొందారు. అలాగే మరికొంతమంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను తక్షణమే ఆర్మీ హెలికాప్టర్ ద్వారా చికిత్స నిమిత్తం మిలటరీ ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన అదనపు రక్షణ బలగాలు, ఉఖ్రుల్ జిల్లా పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి, దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ మరియు ప్రత్యేక బలగాలు సంయుక్తంగా యుద్ధప్రాతిపదికన ముమ్మర గాలింపు చర్యలు (Search Operation) చేపట్టాయి.






