- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి పెంపుడు కుక్కకు రేబిస్ టీకా వేయించాలి
by Taduka Kalyani |
ప్రతి పెంపుడు కుక్కకు తప్పనిసరిగా రేబిస్ టీకాలను సకాలంలో వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు వసంతకుమారి అన్నారు.

X
దిశ, సంగారెడ్డి : ప్రతి పెంపుడు కుక్కకు తప్పనిసరిగా రేబిస్ టీకాలను సకాలంలో వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు వసంతకుమారి అన్నారు. సోమవారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జిల్లా పశువైద్యశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 200 పెంపుడు, వీధి కుక్కలకు ఉచితంగా రేబిస్ నిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జూనోసిస్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమని అన్నారు. ప్రజలు తమ పెంపుడు జంతువులకు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా రేబిస్ టీకా వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డా. టి. ఆదిత్య వర్మ, డా. ఎస్. జయకుమార్, డా. టి. పవన్ కుమార్, డా. ఎ. శ్రీనివాస్, పశువైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డా. జె. అజిత్ చంద్రతో పాటు జిల్లా పశువైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు
Next Story






