సంచలన ప్రకటన చేసిన క్రిస్టియానో రొనాల్డో

by Harish |

ఫిఫా వరల్డ్ కప్-2026 తన చివరి ప్రపంచకప్ అని ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ధ్రువీకరించాడు

సంచలన ప్రకటన చేసిన క్రిస్టియానో రొనాల్డో
X

దిశ, స్పోర్ట్స్ : ఫిఫా వరల్డ్ కప్-2026 తన చివరి ప్రపంచకప్ అని ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ధ్రువీకరించాడు. స్పెయిన్‌తో మ్యాచ్‌కు ముందు ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రొనాల్డో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఆటను వీలైనంత ఎక్కువగా ఆస్వాదించడమే ముఖ్యం. ఇదే నా చివరి వరల్డ్ కప్. స్పెయిన్‌తో మ్యాచ్ నా చివరి గేము కావొద్దని ఆశిస్తున్నా. అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి రిటైరయ్యే రోజు వస్తుంది. రేపు ఏం జరిగినా నేను 100 శాతం కాదు 1000 శాతం ప్రశాంతంగా నిష్ర్కమిస్తా. ఫుట్‌బాల్‌కు నా సర్వస్వాన్ని ఇచ్చేశా. ఇంకా నాకు ఏం అవసరం లేదు. కానీ, ఇది అభిరుచికు సంబంధించింది. నేను ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తున్నా. అందుకే ఆడుతున్నా. ప్రతి రోజు ఆస్వాదిస్తున్నా.’అని తెలిపాడు. తనకు జీవితంలో ఎలాంటి లోటు లేదని, వరల్డ్ కప్ గెలిచినంత మాత్రనా తాను ఎక్కువనో, తక్కువనో అయిపోనని చెప్పాడు. కానీ, దేశం గెలుస్తుందన్నాడు. అలాగే, తనపై వస్తున్న విమర్శలపై రొనాల్డో స్పందిస్తూ.. ‘వయసు పెరిగే కొద్ది మనకు పరిణతి, అనుభవం వస్తాయి. ఇప్పటికీ నాపై విమర్శలు వస్తున్నాయి. నాకు 40 ఏళ్లు నిండుతున్నాయి. ఈ విమర్శలతో మరో 40 ఏళ్లు బతికేస్తా. విమర్శలతోనే వ్యక్తిగా ఎదగగలరు. అందరికీ థ్యాంక్స్.’అని రొనాల్డో చెప్పుకొచ్చాడు. ఈ వరల్డ్ కప్‌లో రొనాల్డో మూడు గోల్స్ చేశాడు. అతనికి ఇది 6వ ప్రపంచకప్ కావడం గమనార్హం. అన్ని వరల్డ్ కప్‌ల్లోనూ గోల్ చేసిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు నమోదు చేశాడు.


Next Story