బస్సు నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి..

by Taduka Kalyani |

బస్సు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద సంఘటన మిరుదొడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

బస్సు నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి..
X

దిశ, మిరుదొడ్డి: బస్సు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద సంఘటన మిరుదొడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిరుదొడ్డి గ్రామానికి చెందిన వడ్ల రాములు (63) ఆదివారం హైదరాబాద్ వెళ్లేందుకు బస్సు ఎక్కారు. అయితే ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో బస్సు డోర్ వద్ద నిల్చొని ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు బస్సులోంచి కిందపడిపోవడంతో తలకు, తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి ఆయనను చికిత్స నిమిత్తం సిద్దిపేట లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వడ్ల రాములు మృతితో మిరుదొడ్డి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై మిరుదొడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story