- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారులతో కలిసి ‘చిర్ర గోనె’ ఆడిన హరీశ్ రావు (వీడియో)
రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటూ, ప్రజల్లో ఉండేందుకు ఇష్టపడే బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి తన వినూత్న శైలితో అందరి దృష్టిని ఆకర్షించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటూ, ప్రజల్లో ఉండేందుకు ఇష్టపడే బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి తన వినూత్న శైలితో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన సొంత నియోజకవర్గమైన సిద్ధిపేట పర్యటనలో భాగంగా హరీశ్ రావు స్థానికంగా పర్యటించారు. ఈ క్రమంలో వీధిలో కొందరు చిన్నారులు మన సంప్రదాయ గ్రామీణ ఆట 'చిర్రగోనె' (బిళ్లంకోడు / గిల్లిదండా) ఆడుతూ కనిపించారు. వారిని చూడగానే హరీశ్ రావు తన బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ప్రోటోకాల్స్, రాజకీయాలను పక్కనబెట్టి నేరుగా ఆ పిల్లల వద్దకు వెళ్లి, కర్ర పట్టుకుని వారితో కలిసి చిర్రగోనె ఆడ్డారు. ఒక పక్కా లోకల్ ప్లేయర్ ఆయన చిర్రను గాల్లోకి లేపి కొట్టిన తీరు అక్కడున్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి తమతో కలిసి అంత సరదాగా ఆడటంతో చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్..
ఆట ముగిసిన తర్వాత ఈ జ్ఞాపకాలకు సంబంధించిన విజువల్స్‌ను హరీశ్ రావు తన అధికారిక సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక చక్కని సందేశాన్ని ఇస్తూ.. "గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న ఆటలను నేటి తరానికి పరిచయం చేసి, వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఇంతకీ ఈ ఆట పేరు ఏంటో చెప్పగలరు.?" అంటూ నెటిజన్లను అడిగారు. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. "మా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తొచ్చాయి సార్", "చిర్రగోనె, బిళ్లంకోడు, గిల్లిదండా" అంటూ కామెంట్లు పెడుతున్నారు.






