- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొమ్మాల లక్ష్మీ నరసింహుని గుట్ట చుట్టూ శాశ్వత రహదారి ఆక్రమణ
లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట చుట్టూ భక్తుల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన 30 అడుగుల శాశ్వత రహదారి ఇప్పుడు ఆక్రమణకు గురైంది.

దిశ, గీసుకొండ : కొమ్మాలలో గల లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట చుట్టూ భక్తుల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన 30 అడుగుల శాశ్వత రహదారి ఇప్పుడు ఆక్రమణకు గురైంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా గుట్ట చుట్టూ ఉన్న రోడ్డు భూమిని రైతులు ఆక్రమించి పంటలు వేసుకుంటున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగింది?
గత కొమ్మల జాతర సమయంలో స్థానిక ఎమ్మెల్యే గుట్ట చుట్టూ ఉన్న రహదారిపై మోరం పోయించి ,ఎడ్ల బండ్లు, వాహనాలు సులభంగా తిరిగేందుకు వీలుగా శాశ్వత మార్గాన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో అధికారులకు గుట్ట చుట్టూ హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.కానీ అధికారులు ఆదేశాలను పట్టించుకోలేదు. హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పుడు సుమారు 150 మీటర్ల పొడవు రోడ్డులో సగానికి పైగా భాగాన్ని రైతులు ఆక్రమించి వ్యవసాయంచేస్తున్నారు.
భక్తుల ఆగ్రహం
అధికారులు అప్పుడే హద్దులు వేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. జాతర సమయంలో వేలాది మంది భక్తులు, వాహనాలు ఇబ్బంది పడుతున్నాయ అని భక్తులు అంటున్నారు.గతంలో ఎమ్మెల్యే గుట్ట చుట్టూ సీసీ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని వారు గుర్తు చేశారు.
భక్తుల డిమాండ్
వెంటనే గుట్ట చుట్టూ ఉన్న దేవస్థాన రోడ్డు భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి. ఆక్రమణలను తొలగించి రోడ్డును పునరుద్ధరించాలి.ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు సీసీ రోడ్డు పనులు చేపట్టాలి.దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.






