జకార్తా గగనతలంలో యుద్ధ విమానాలతో కాన్వాయ్ ప్రధాని మోడీకి స్వాగతం

by Malleboina Mahesh |

ఇండోనేషియా చేరిన పీఎం మోడీ.. స్వాగతం పలికిన ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో.. గగనతలంలో యుద్ధ విమానాలతో ప్రధానికి ఘన గౌరవం!

జకార్తా గగనతలంలో యుద్ధ విమానాలతో కాన్వాయ్ ప్రధాని మోడీకి స్వాగతం
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీకి జకార్తాలో ఘన స్వాగతం లభించింది. అంతర్జాతీయ దౌత్య సంబంధాల బలోపేతం లో భాగంగా భారత ప్రధాని ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకున్నారు. జకార్తా విమానాశ్రయంలో అడుగుపెట్టిన ప్రధాని మోడీకి ఇండోనేషియా ప్రభుత్వం అత్యంత అపూర్వమైన, అధికారిక సైనిక లాంఛనాలతో ఘనస్వాగతం పలికింది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (Prabowo Subianto) స్వయంగా విమానాశ్రయానికి విచ్చేసి ప్రధాని మోదీకి సాదరంగా స్వాగతం పలికారు.

గగనతలంలో యుద్ధ విమానాల పహారా

భారత ప్రధాని పర్యటనకు ఇండోనేషియా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన భద్రతా ప్రోటోకాల్‌ను కేటాయించింది. పీఎం మోడీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఇండోనేషియా వైమానిక సరిహద్దుల్లోకి (Air Space) ప్రవేశించిన క్షణం నుంచే.. ఆ దేశ వైమానిక దళానికి (Indonesian Air Force) చెందిన యుద్ధ విమానాలు (Fighter Jets) ఎస్కార్ట్‌గా మారి, ప్రధాని విమానానికి గగనతలంలో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాయి. విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే వరకు మోడీ విమానం వెంటే ప్రయాణిస్తూ ఇండోనేషియా వాయుసేన భారత్‌కు అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ఈ ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధన, వ్యూహాత్మక రంగాలపై కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.

Next Story