- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరల్ డాక్టరమ్మ.. పీరియడ్స్, సెక్స్‌పై బోల్డ్ ఆన్సర్స్
ఇండియాలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉందనేది వాస్తవం. దాదాపు వంద కోట్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. కానీ ఇందులో దొరికే సమాచారం పూర్తిగా నిజమేనా అంటే అస్సలు కాదు.

దిశ, ఫీచర్స్ : ఇండియాలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉందనేది వాస్తవం. దాదాపు వంద కోట్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. కానీ ఇందులో దొరికే సమాచారం పూర్తిగా నిజమేనా అంటే అస్సలు కాదు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో మనం ఆన్ లైన్‌లో చూసే వీడియోలను ఫాలో అయితే ఏదో ఒక రోజు హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే. అంత తప్పుడు సమాచారం ఉంటుంది. ఇదంతా చూసి విసుగొచ్చిన డాక్టర్.. తనే కంటెంట్ క్రియేటర్‌గా మారింది. పేషెంట్స్ డాక్టర్‌ను అడగలేని ప్రశ్నలను ప్రస్తావిస్తూ.. సమాధానాలు చెప్తూ.. వావ్ అనిపిస్తుంది.
చాలా మంది డాక్టర్లు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్‌గా మారింది.. ఆరోగ్యానికి సంబంధించిన తప్పుడు సమాచారం చూసే.. వాటన్నింటిని కరెక్ట్ చేసేందుకే. ఈ లిస్ట్‌లో డాక్టర్ తనయ నరేంద్ర కూడా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 20 లక్షల ఫాలోవర్లు ఉన్న ఆమె.. మహిళల ఆరోగ్యం, రిప్రొడక్టివ్ హెల్త్, సెక్స్ ఎడ్యుకేషన్ అంశాలపై సులభంగా అర్థమయ్యే విధంగా కంటెంట్ తయారు చేస్తారు. రోగులు క్లినిక్‌లో అడగడానికి సిగ్గుపడే ఇబ్బందికర ప్రశ్నలు అంటే.. పీరియడ్స్, ఫెర్టిలిటీ, బ్రెస్ట్/జననేంద్రియ సమస్యలు, శరీర ఆకృతికి గురించి అపోహలపై సమాధానం ఇస్తారు.
ముఖ్యంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ గురించి ఆమె చేసిన అవేర్నెస్ కంటెంట్ చాలా ఇంపాక్ట్ చూపించింది. భారతీయ మహిళల్లో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్.. సెర్వికల్ క్యాన్సర్.. నివారణకు బాగా సహాయపడింది. 9–45 ఏళ్ల మధ్య ఉన్న ఆడ పిల్లలు వ్యాక్సిన్ తీసుకోవాలని.. 30 ఏళ్ల తర్వాత పాప్ స్మియర్ చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఆమె కంటెంట్ పబ్లిక్ పాలసీలపై కూడా ప్రభావం చూపింది. దీంతో కంటెంట్‌ను బాధ్యతగా తీసుకున్న ఆమె.. మూడు రోజులు రోగులను చూస్తూ.. మరో మూడు రోజులు కంటెంట్ తయారీలో బిజీగా ఉంటారు. అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బర్నౌట్ రాకుండా బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఆమె రోగి ఫోటోలు ఎప్పుడూ ఉపయోగించరు.






