- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ 300 కోట్ల అక్రమాస్తులు.. డీఎస్సీ భీమ్ రెడ్డి అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ.. రూ.200 కోట్ల విలువైన ఆస్తులు, 2 కేజీల బంగారం స్వాధీనం!

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీస్ శాఖలో ఆదాయానికి మించిన ఆస్తుల (Disproportionate Assets) కేసు కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS) విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఈ రోజు(సోమవారం) అధికారికంగా అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం భీమ్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాలతో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన 16 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో జరిపిన మెరుపు సోదాల (ACB Raids) అనంతరం ఈ అరెస్ట్ చోటుచేసుకుంది.
బినామీల పేరిట భారీగా ఆస్తులు..
ఏసీబీ జరిపిన తనిఖీల్లో డీఎస్పీ భీమ్‌రెడ్డి సంపాదించిన అక్రమాస్తుల మార్కెట్ విలువ సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్ల పైమాటే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మణికొండ, టెలికాం నగర్, ఇబ్రహీంబాగ్‌లోని లగ్జరీ విల్లాతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వందల ఎకరాల వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. తన వద్ద పనిచేసిన ఒక మాజీ హోంగార్డు, వాచ్‌మన్‌ల పేరిట కూడా భీమ్‌రెడ్డి కోట్లాది రూపాయల బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో తేలింది. వీటితో పాటు నిందితుడి ఇళ్ల నుంచి రూ.43.6 లక్షల నగదు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి వస్తువులను సీజ్ చేశారు. ఈ క్రమంలో కోర్టు అనుమతితో నిందితుడిని రిమాండ్‌కు తరలించి, మరింత సమాచారం కోసం ఏసీబీ అధికారులు విచారణను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.






