- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్రను ముంచెత్తిన వర్షం.. 13 మంది మృతి
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని నగరాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ముంబై-పూణె నేషనల్ హైవే నీటమునిగిపోయవడంతో వందలాది వాహనాలు రోడ్డున నిలిచాయి. హైవేపై వరుసగా కొండచరియలు విరిగిపడటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, కాలనీలు, రైల్వే ట్రాకులు సైతం చెరువులను తలపిస్తున్నాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వానల కారణంగా ముంబై, పాల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో వేర్వేరు ప్రమాదాల్లో ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబయి దాని పరిసర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) అత్యంత ప్రమాదకరమైన 'రెడ్ అలర్ట్' (Red Alert) జారీ చేసింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం లోనావాలాలో రికార్డు స్థాయిలో 670 మిల్లీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితులపై మహారాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి గిరీష్ మహాజన్ సోమవారం అధికారిక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల భారీ నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.






