- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరెంట్ పోతే జియో సిగ్నల్ కట్.. ఎస్‌ఐఆర్ (SIR) సర్వేకు తీవ్ర ఆటంకం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రతిసారీ జియో మొబైల్ నెట్‌వర్క్ పూర్తిగా నిలిచిపోతుండడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, రెబ్బెన : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రతిసారీ జియో మొబైల్ నెట్‌వర్క్ పూర్తిగా నిలిచిపోతుండడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ పోయిన వెంటనే జియో సిగ్నల్ పూర్తిగా కట్ కావడంతో పాటు ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోతున్నాయి. దీంతో ఆన్‌లైన్ పనులన్నీ స్తంభిస్తున్నాయి. ప్రస్తుతం మండలంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (SIR) సర్వే పనులు కూడా ఈ సమస్యతో తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు సర్వేలో భాగంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడం, మ్యాపింగ్ నిర్వహించడం, డేటాను అప్‌లోడ్ చేయడం వంటి పనులు నిర్వహిస్తున్నారు.
అయితే విద్యుత్ అంతరాయం ఏర్పడిన ప్రతిసారీ జియో నెట్‌వర్క్ అందుబాటులో లేకపోవడంతో సర్వే పనులు నిలిచిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా సర్వే ప్రక్రియ ఆలస్యమవుతోందని తెలిపారు. జియో వినియోగదారులు మాట్లాడుతూ కరెంట్ పోయిన ప్రతిసారీ నెట్‌వర్క్ పూర్తిగా నిలిచిపోవడంతో అత్యవసర సమాచార మార్పిడి, ఆన్‌లైన్ సేవలు, ప్రభుత్వ సంబంధిత పనులు కూడా అంతరాయం కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అంతరాయం సమయంలో కూడా మొబైల్ నెట్‌వర్క్ సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు తగిన బ్యాకప్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జియో సంస్థ అధికారులు వెంటనే స్పందించాలని వినియోగదారులు కోరుతున్నారు.






