తెలంగాణ అసెంబ్లీ వద్ద గాలి దుమారం.. ఎమ్మెల్యేల ఎంట్రన్స్ గేటు వద్ద విరిగిపడ్డ చెట్టు

by Gantepaka Srikanth |   (  Updated:2026-07-06 10:46:49  IST  )

రాజధాని హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన గాలి దుమారం బీభత్సం సృష్టించింది.

తెలంగాణ అసెంబ్లీ వద్ద గాలి దుమారం.. ఎమ్మెల్యేల ఎంట్రన్స్ గేటు వద్ద విరిగిపడ్డ చెట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ భవనం వద్ద భారీ గాలి దుమారం చెలరేగింది. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అసెంబ్లీ ప్రాంగణంలోని ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం (ఎంట్రన్స్ గేట్) వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టు ఒక్కసారిగా విరిగి కిందపడిపోయింది. చెట్టు కూలిన సమయంలో ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు గానీ, అధికారులు గానీ ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. సాధారణంగా ప్రజాప్రతినిధులు, వారి అనుచరులతో బిజీగా ఉండే ఈ గేటు వద్ద ప్రమాదం జరిగిన సమయంలో జనసంచారం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వెంటనే స్పందించిన సిబ్బంది..

ప్రమాదం జరిగిన వెంటనే అసెంబ్లీ సెక్యూరిటీ, సచివాలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిబ్బంది రంగంలోకి దిగి ఆధునిక యంత్రాల సహాయంతో విరిగిపడిన చెట్టు కొమ్మలను కట్ చేసి, అక్కడి నుండి వేగంగా తొలగించారు. దీంతో ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా గంట వ్యవధిలోనే మార్గాన్ని పునరుద్ధరించారు.

Next Story