- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల అవినీతి అంతం కావాలంటూ పొర్లు దండాలతో నిరసన
by velandi.Saikiran |
పోలీసుల అవినీతి అంతం కావాలంటూ పొర్లు దండాలతో ఒక వ్యక్తి నిరసన నిరసన తెలిపిన సంఘటన హన్మకొండలో చోటు చేసుకుంది.

X
దిశ, హన్మకొండ కలెక్టరెట్: పోలీసుల అవినీతి అంతం కావాలంటూ పొర్లు దండాలతో ఒక వ్యక్తి నిరసన నిరసన తెలిపిన సంఘటన హన్మకొండలో చోటు చేసుకుంది. పోలీస్ శాఖలో అవినీతి నిర్మూలన చేయాలని డిమాండ్ చేస్తూ దుగ్గొండి మండలానికి చెందిన సురేందర్ హనుమకొండ అంబేద్కర్ విగ్రహం కూడలి వద్ద వినూత్నంగా సోమవారం నిరసన చేపట్టారు. పొర్లు దండాలు చేస్తూ తన నిరసనను వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థలో అవినీతి నశించాలని ప్రజలకు పారదర్శకంగా న్యాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన భూమిని కొంత మంది అక్రమంగా కబ్జా చేశారని పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులే తనను వేధించారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






